కూరగాయల సాగులో సిద్దిపేట జిల్లా నంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2021-11-28T04:52:57+05:30 IST

కూరగాయల సాగులో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు.

కూరగాయల సాగులో సిద్దిపేట జిల్లా నంబర్‌ వన్‌
బండనర్సంపల్లిలో పందిరి సాగును పరిశీలిస్తున్న ఆనంద్‌కుమార్‌

 ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ కుమార్‌


ములుగు, నవంబరు 27: కూరగాయల సాగులో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ నర్సంపల్లి గ్రామంలో పందిరి సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో ఆనంద్‌కుమార్‌ మాట్లాడారు. కూరగాయల సాగుతో అధిక లాభాలు వస్తాయని చెప్పారు. బండ నర్సంపల్లి గ్రామంలో 14 ఎకరాల 20 గుంటల్లో కూరగాయల పందిరి సాగు చేస్తున్న 18 మంది దళిత రైతులకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ కింద రూ.54 లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఆయనవెంట ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, లక్ష్మణ్‌, నర్సింహులు, నర్సింహారెడ్డి ఉన్నారు.


 

Updated Date - 2021-11-28T04:52:57+05:30 IST