సైడ్‌ ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే?

Published: Tue, 01 Jun 2021 09:16:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సైడ్‌ ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే?

ఆంధ్రజ్యోతి(1-06-2021)

వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే తాపత్రయంతో పాటు, వ్యాక్సిన్‌తో తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ పట్ల భయం కూడా అంతే సమానంగా ఉంటోంది. అయితే ఆ లక్షణాల గురించి భయాలు వదిలించుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కనిపించే లక్షణాల తీవ్రతను తేలికపాటి చిట్కాలతో తగ్గించుకునే వీలుంది. 


వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కొందర్లో జ్వరం, ఒళ్లు నొప్పులు రెండు రోజుల పాటు వేధిస్తాయి. అయితే ఈ లక్షణాలు వ్యాక్సిన్‌తో శరీరంలో యాంటీబాడీలు తయారవుతున్నాయి అనడానికి సంకేతాలు మాత్రమే! అయితే తాత్కాలికంగా ఇబ్బందిపెట్టే ఈ అసౌకర్యాలకు భయపడి వ్యాక్సిన్లకు దూరం కాకూడదు. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించాలి.


నీళ్లు తాగాలి: నీళ్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు నెట్టేస్తాయి. కాబట్టి వ్యాక్సిన్‌తో శరీరంలో చోటు చేసుకున్న దుష్ప్రభావాలను వదిలించుకోవాలంటే వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత రెండు రోజుల పాటు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరినీళ్లు, పళ్లరసాలు కూడా తాగవచ్చు.


విశ్రాంతి: యాంటీబాడీలు తయారుచేయడానికి శరీర వ్యాధినిరోధక వ్యవస్థ ఎంతో శ్రమకు లోనవుతుంది. ఆ క్రమంలో తలనొప్పి, కీళ్లనొప్పులు, జ్వరం మొదలవుతాయి. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని అదనపు శ్రమకు గురి చేయకూడదు. వీలైతే వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత ఎక్కువ సమయం పాటు నిద్రపోవాలి. అలా వీలుపడకపోతే మనసును ప్రశాంతంగా ఉంచే ధ్యానం, యోగా సాధన చేయవచ్చు. ఒత్తిడి లేని శరీరంలో యాంటీబాడీలు వేగంగా తయారవుతాయి.


నొప్పి: ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి కూడా రెండు రోజుల పాటు వేధిస్తుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆ ప్రదేశంలో ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి. ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవాలి.Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.