పక్కకు తప్పించి.. ఎన్నిక పూర్తి చేయించి...!

Sep 25 2021 @ 00:19AM

టంగుటూరు వైస్‌ ఎంపీపీ కోసం చివర వరకూ పోరాడిన ప్రదీప్‌

మంత్రి బాలినేని మాట్లాడతారంటూ ఒంగోలు పంపిన వైసీపీ ఇన్‌చార్జి వెంకయ్య

ఆ వెంటనే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక పూర్తి

టంగుటూరు, సెప్టెంబరు 24 : మండల పరిషత్‌ ఉ పాధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి భంగపడ్డ కారుమంచి ఎంపీటీసీ సభ్యుడు రావెళ్ల ప్రదీప్‌ను వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్య తెలివిగా పక్కకు తప్పించి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక పూర్తి చేశారు. వివరాల్లోకెళ్లే... టంగుటూరు మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎంపిక సందర్భంగా శుక్ర వారం ముందుగా డాక్టర్‌ వెంకయ్య టంగుటూరులోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే తన మద్ద తుదారులతో అక్కడికి చేరుకున్న కారుమంచి ఎంపీటీసీ సభ్యుడు ప్రదీప్‌ వైస్‌ ఎంపీపీగా తనకెందుకు అవకాశం ఇవ్వరని వెంకయ్యను ప్రశ్నించారు. ప్రదీప్‌కు మద్దతుగా వచ్చిన కారుమంచి గ్రామస్థులు కొందరు వైస్‌ ఎంపీపీ ఇవ్వాలని వాదించారు. ముందుగా హామీ ఇచ్చి ఇప్పుడు కాదనం ఏమిటని, ఇలా చేస్తే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యలకు పాల్పడతామని డబ్బాలను చూపిస్తూ హెచ్చరించారు. దీంతో వెంకయ్య మండల పార్టీ పెద్ద లతో సంప్రదించి ఫోన్‌ ద్వారా మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డికి ఇక్కడి విషయం చేరవేశారు. ‘మంత్రి మీతో మాట్లాడుతానంటున్నారు, మీరు ఒంగోలు వెళ్లిరండని’ ప్రదీప్‌ వర్గానికి వెంకయ్య సూచించారు. తాము తిరిగి వచ్చే వరకు ఎన్నికల ఆపాలని చెప్పి ప్రదీప్‌ తన మద్దతుదారులతో మంత్రిని కలిసేందుకు హడావుడిగా ఒంగోలు వెళ్లారు. వాళ్లు అటు వెళ్లగానే ఇటు ఎన్నిక తం తు ప్రారంభమైంది. ప్రదీప్‌ వర్గం తిరిగి రాకమునుపే సభ్యుల ప్రమాణ స్వీకారాలు, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపిక జరిగిపోయాయి. ప్రదీప్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఈసంఘటన టీకప్పు లో తుఫాన్‌గా భావించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.