Sidhu Moose murder case: షూటర్ సౌరభ్ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-09T00:22:58+05:30 IST

సంచలనం సృష్టించిన సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులో పరారీలో ఉన్న షూటర్ సౌరభ్ అలియాస్..

Sidhu Moose murder case: షూటర్ సౌరభ్ అరెస్టు

పుణె: సంచలనం సృష్టించిన సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులో పరారీలో ఉన్న షూటర్ సౌరభ్ (saurabh) అలియాస్ సిద్ధేష్ కాంబ్లెను పుణె రూరల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. దీంతో ఇంతవరకూ ఈ హత్య కేసులో అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరిలో 8 మందిని లాజిస్టిక్ సపోర్ట్, రెక్కీ నిర్వహించడం, షూటర్లకు ఆశ్రయం కల్పించడం వంటి ఆరోపణలపై అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నలుగురు షూటర్లను కూడా గుర్తించామని తెలిపారు. సింగర్ మూసేవాలా మే 29న హత్యకు గురయ్యాడు. గ్యాంగుల మధ్య శత్రుత్వం కారణంగానే ఈ ఘటన జరిగిందని, లారెన్స్ విష్ణోయ్ గ్యాంగు దీని వెనుక ఉందని రాష్ట్ర పోలీసులు ఇంతకుముందు ప్రకటించారు.

Updated Date - 2022-06-09T00:22:58+05:30 IST