ఫుల్ జోష్‌లో Siemens.. 1 ట్రిలియన్ దాటిన ఎం-క్యాప్

Published: Wed, 10 Aug 2022 14:09:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫుల్ జోష్‌లో Siemens.. 1 ట్రిలియన్ దాటిన ఎం-క్యాప్

Siemens Shares : బలమైన ఆర్డర్ బుక్ పొజిషన్‌(strong order book position) తో హెవీ ఎలక్ట్రికల్ పరికరాల కంపెనీ సిమెన్స్ తన ర్యాలీని కొనసాగిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ(BSE)లో సిమెన్స్ షేరు 1 శాతం పెరిగి రూ. 2,845.75 వద్ద కొత్త గరిష్టానికి చేరింది. గత మూడు నెలల్లో హెవీ ఎలక్ట్రికల్ పరికరాల కంపెనీ స్టాక్ 26 శాతం పెరగడం ద్వారా మార్కెట్‌తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌(S&P BSE Sensex)లో 8 శాతం పెరిగింది. 


స్టాక్ ధర(Stock Price) దూసుకుపోవడంతో.. కంపెనీ ఏకంగా రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-cap) కలిగిన కంపెనీల ఎలైట్ క్లబ్‌(Elite Club)లోకి ప్రవేశించింది. ఆగస్ట్ 2న జూన్ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. సీమెన్స్ కొనసాగుతున్న కార్యకలాపాల నుంచి కంపెనీ ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.17,856 కోట్లుగా ఉంది. గత ఏడాది క్యూ3లో కొనసాగుతున్న కార్యకలాపాల నుంచి కొత్త ఆర్డర్లు రూ. 4,992 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ తెలిపింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

బిజినెస్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.