జ్వరాలపై జల్లెడ

ABN , First Publish Date - 2021-05-11T04:28:56+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 649 వైద్య బృందాలు జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నాయి.

జ్వరాలపై జల్లెడ
మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య బృందాలు

జిల్లాలో 649 బృందాలతో 

జ్వరాలపై ఇంటింటి సర్వే

లక్ష్యం 2,55,000 గృహాలు.. 

ఇప్పటి వరకు తనిఖీ చేసినవి 2,01,636


మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) మే 10: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 649 వైద్య బృందాలు జ్వర పీడితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నాయి. లక్షణాలు ఉన్నవారిని ఇంటివద్దే గుర్తించి, వారికి మందుల కిట్లను పంపిణీ చేస్తే వైరస్‌ను కొంతవరకైనా కట్టడి చేయవచ్చనే ఉద్దేశంతో ఈ సర్వేను చేపట్టారు. ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ, మునిసిపల్‌ సిబ్బందిని సర్వే కోసం తీసుకున్నారు. వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, కీళ్లు, ఒళ్లు నొప్పులు ఇతర లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్ష చేస్తారు. లక్షణాలు ఉంటే అక్కడే మందుల కిట్లు అందిస్తున్నారు. జిల్లాలో ఈనెల 3 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 7,155 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి అక్కడే వారికి మందుల కిట్లను అందించారు. జాగ్రత్తలను తెలిపారు. సర్వే కార్యక్రమం మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.

మిగిలినవి 53,364 ఇళ్లు: జిల్లాలో మొత్తం 2,55,000 ఇండ్లను సర్వే చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,01,636 ఇళ్లను సర్వే చేశారు. ఇంకా 53,364 ఇండ్లు మిగిలిఉన్నాయి. వీటిని ఈ రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్వే వలన వైరస్‌ను కొంత వరకు కట్టడి చేసే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-11T04:28:56+05:30 IST