రైతుల నడ్డి విరిచిన కేంద్రం

ABN , First Publish Date - 2022-01-18T05:10:11+05:30 IST

తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి సాగు వ్యయాన్ని మూడింతలు చేసిందని డీసీసీబీ డైరెక్టర్‌ ఎంఏ సుభాన్‌ విమర్శించారు.

రైతుల నడ్డి విరిచిన కేంద్రం
ఫ్లెక్సీపై సంతకం చేస్తున్న రైతు

- డీసీసీబీ డైరెక్టర్‌ సుభాన్‌ 

- రైతులతో సంతకాల సేకరణ ఉద్యమం

గద్వాల టౌన్‌, జనవరి 17 : తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి సాగు వ్యయాన్ని మూడింతలు చేసిందని డీసీసీబీ డైరెక్టర్‌ ఎంఏ సుభాన్‌ విమర్శించారు. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచడమే పనిగా పెట్టుకున్న నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్యుల జీవితాలను దుర్భరంగా మార్చిందని ఆరోపించారు. ఎరువుల ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, కురుమన్న ఆధ్వర్యంలో రైతులతో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ రైతులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల జీవన స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వా నికి ఏ మాత్రం బాధ్యత లేకుండా పోయిందన్నారు. గద్వాల ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఊరట పొందిన తెలంగాణ రైతులకు, కేంద్రం మరోసారి ఎరువుల ధరలు పెంచడంతో వ్యవసాయం మరింత భారంగా మారనుందన్నారు. సంతకాల ఉద్యమానికి సహక రించాలని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వ రమ్మ రైతులను కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డెరక్టర్లు సవారన్న, సాయిబాబా, కౌన్సిలర్‌ నరహరి శ్రీనివాసులు, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్‌గౌడ, సర్పంచ్‌ వాసు, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు గోవిందు, రాములు, నాయకులు రమేష్‌నాయుడు, ఆలూరు బిలకంటి రాముశెట్టి, ధర్మనాయుడు, హనుమంత రెడ్డి, పూడూరు చెన్నయ్య, అలీ, పవన్‌యాదవ్‌ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:10:11+05:30 IST