SIIMA: ఉత్తమ నటుడు.. అల్లు అర్జున్

Sep 19 2021 @ 20:28PM

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ - సైమా. సౌత్‌ సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ఈ వేడుక 2019, 2020లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల వేడుకను ఈ సంవత్సరం వైభవంగా జరిపేందుకు సైమా సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ అవార్డ్స్‌ల వేడుకలో.. 2019 విన్నర్స్‌కి శనివారం అవార్డులు అందించారు. ఆదివారం 2020లో గెలుపొందిన విన్నర్స్‌కు అవార్డులు అందించారు. 2020 సంవత్సరానికిగానూ విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


‘సైమా’ అవార్డ్స్ 2020 (తెలుగు) విజేతల వివరాలు

ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్)

ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)

ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)

ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)

ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)

ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)

ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)

ఉత్తమ గాయని: మధుప్రియ (హిజ్ ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)

ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)

ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)

ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)

ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)

ఉత్త తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్‌ఫొటో)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు) 

ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.