శిఖం భూముల్లో రైతు వేదికా?

ABN , First Publish Date - 2020-10-20T06:19:31+05:30 IST

చెరువు శిఖం భూముల్లో రైతు వేదికను ఎలా నిర్మిస్తారని రా ష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అదే జరిగితే త క్షణమే పనులు ఆపాలని ఆదేశించింది

శిఖం భూముల్లో రైతు వేదికా?

అదే నిజమైతే తక్షణమే పనులు ఆపండి

క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వండి

నిజామాబాద్‌ కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): చెరువు శిఖం భూముల్లో రైతు వేదికను ఎలా నిర్మిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అదే జరిగితే త క్షణమే పనులు ఆపాలని ఆదేశించింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామంలోని చెరువు శిఖం భూముల్లో రైతువేదికను నిర్మిస్తున్నారం టూ గ్రామానికి చెందిన చిలుకూరి బజన్న దాఖలు చే సిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గ్రామంలోని ఊరచెరువు, నల్లచెరువు శిఖం భూముల్లో ప్రభుత్వం రైతువేదిక ని ర్మాణం తలపెట్టిందని, దీనిని నిర్మించవద్దని అధికారు లకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని పిటిషనర్‌ తెలిపారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజ య్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచా రించింది.


ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది రచ నారెడ్డి వాదిస్తూ.. రైతువేదికను దసరాకు ప్రారంభిం చేందుకు పనులు వేగంగా చేస్తున్నారని కోర్టుకు తెలి పారు. అయితే రైతు వేదికను పిటిషనర్‌ చెబుతున్న సర్వే నెం.434లో నిర్మించడం లేదని, సర్వే నెం.439 లోని పట్టా భూమిలో నిర్మిస్తున్నారని ప్రభుత్వం త రపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ భూమిని రైతువేది క నిర్మాణం కోసం ఒక రైతు ప్రభుత్వానికి కానుకగా ఇచ్చారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై న వంబరు 4లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించిం ది. తదుపరి విచారణను ఐదున వాయిదా వేసింది. 

Updated Date - 2020-10-20T06:19:31+05:30 IST