తీర్థయాత్రకు పాక్ వెళ్లిన Sikh మహిళ.... భర్తకే షాకిచ్చింది

ABN , First Publish Date - 2021-11-28T18:14:31+05:30 IST

విహార యాత్రకోసం పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ తన భర్తకే షాక్ ఇచ్చింది. అక్కడ లాహోర్‌లో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన పర్మిందర్ కౌర్(పేరు మార్చాం) అనే వివాహిత ..

తీర్థయాత్రకు పాక్ వెళ్లిన Sikh మహిళ....  భర్తకే షాకిచ్చింది

విహార యాత్రకోసం పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ తన భర్తకే షాక్ ఇచ్చింది. అక్కడ లాహోర్‌లో మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన పర్మిందర్ కౌర్(పేరు మార్చాం) అనే వివాహిత సిక్కు మహిళ గురుపూర్బ్ కోసం పాక్‌కు వెళ్లాలనుకుంది. నవంబర్ 17న మొదటి సిక్కు గురువు గురునానక్ దేవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు అత్తారి నుంచి అంతర్జాతీయ సరిహద్దును దాటింది. అలా వెళ్లిందో.. లేదో.. వెంటనే లాహోర్ వాసిని వివాహం చేసుకుంది. పర్మిందర్ కౌర్ నవంబర్ 24న లాహోర్ నివాసి ముహమ్మద్ ఇమ్రాన్‌ను వివాహం చేసుకుంది. 


ఇమ్రాన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించిందని, లాహోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పర్వీనా.. తన పేరును పర్వీనా సుల్తాన్‌గా మార్చుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. లాహోర్‌కు చెందిన దస్తావేజులు తయారు చేసే రాణా సజవాల్ అనే వ్యక్తి.. భారతీయ మహిళ, ఇద్దరు పురుషులతో కలిసి అఫిడవిట్ కొనుగోలు చేయడానికి వచ్చినట్లు వెల్లడించారు. మహిళకు పాకిస్థానీ గుర్తింపు లేనందున, రాజన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ పేరుతో ఆ పత్రాన్ని జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కౌర్ సోషల్ మీడియాలో ఇమ్రాన్‌ను కలిశారని, ఆమె సంబంధం గురించి ఆమె భర్తకు కూడా తెలుసునని వర్గాలు తెలిపాయి.


ఈ ఘటనను ధృవీకరిస్తూ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన SAD (D) అధ్యక్షుడు పరమజిత్ సింగ్ సర్నా.. లాహోర్ వ్యక్తితో బెంగాలీ సిక్కు మహిళ వివాహం సమాజానికి చాలా ఇబ్బంది కలిగించిందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు పాకిస్తాన్‌కు సిక్కుల తీర్థయాత్రపై నిషేధానికి సైతం దారితీయవచ్చని సర్నా అన్నారు. జాథాల్లో భాగంగా పాకిస్థాన్‌కు వెళ్లే యాత్రికులు మతపరమైన కార్యక్రమాలకే పరిమితం కావాలని ఆయన సూచించారు.


Updated Date - 2021-11-28T18:14:31+05:30 IST