పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటి ముందు మౌనదీక్ష

ABN , First Publish Date - 2021-04-24T04:57:03+05:30 IST

పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష చేపట్టింది.

పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటి ముందు మౌనదీక్ష
యువకుడి ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న కరుణశ్రీ

 ఆత్మకూరు, ఏప్రిల్‌ 23: పెళ్లి చేసుకోవాలని యువకుడి ఇంటి ముందు యువతి మౌన దీక్ష చేపట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని మూలమల్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసు కుంది. మూలమల్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, కరుణశ్రీ ఒకే ఊరి వారు, ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. దాంతో ఏర్పడిన పరిచయం  ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తీరా పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అడిగితే ఇదిగో అదిగో అంటూ ఆరునెలలుగా  తప్పించుకొని తిరుగుతున్నాడని వాపోయింది.    పెళ్లి చేసుకొనే వరకు ఇక్కడి నుంచి వదిలి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతుంది.

Updated Date - 2021-04-24T04:57:03+05:30 IST