దీపిక బృందానికి రజతం ఆర్చరీ

Published: Mon, 27 Jun 2022 04:31:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దీపిక బృందానికి రజతం  ఆర్చరీ

 ప్రపంచకప్‌

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు రజత పతకం దక్కించుకుంది. ఫైనల్లో దీపికా కుమారి, అంకితా భకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం 1-5తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ చెన్‌-యింగ్‌తో కూడిన చైనీస్‌ తైపీ జట్టు చేతిలో పరాజయంపాలై రజతంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఈసారి భారత్‌ ఓ స్వర్ణం, రెండు రజతాలతో మొత్తం మూడు పతకాలు అందుకుంది. ఇందులో రెండు పతకాలు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే ఉండడం విశేషం. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.