అప్పన్న దర్శనాలు నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-11T04:56:18+05:30 IST

కరోనా దృష్ట్యా భక్తులకు సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలను అధికారులు సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేశారు.

అప్పన్న దర్శనాలు నిలిపివేత
మూసిన రాజగోపుర తలుపులు

వెలవెలబోయిన మాడవీధులు



సింహాచలం, మే 10: కరోనా దృష్ట్యా భక్తులకు సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలను అధికారులు సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేశారు. దాంతో నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతుండే సింహగిరి మాడవీధులు, దేవాలయ ప్రాంగణం వెలవెలబోయాయి.  సోమవారం నుంచి 15వ తేదీ వరకు ఆలయంలోనికి భక్తులను అనుమతించకున్నా...స్వామి వారికి వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయ రీతిలో యథావిధిగా జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ ప్రకటించారు. ఈ నెల 14న స్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవం  నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం భక్తులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ సూర్యకళ తెలిపారు. ఈ ఆరు రోజులు పాటు సింహగిరికి భక్తులను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - 2021-05-11T04:56:18+05:30 IST