సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-09-18T07:12:38+05:30 IST

మండలప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ కల్పన జాదవ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికా రులు తమ నివేదికలను చదివి వినిపించారు.

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

భైంసా రూరల్‌, సెప్టెంబరు 17: మండలప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ కల్పన జాదవ్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికా రులు తమ నివేదికలను చదివి వినిపించారు. మొదట మండల విద్యాధికారి సుభాష్‌ మాట్లాడుతూ... సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు పునఃప్రారంభించామని తెలిపారు. హెచ్‌ఈ వో సలీం మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో అవగాహన కల్పించి వారికి ఆర్థికంగా నష్టపోకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. ఉపాధి హమీ ఏపీవో శివలింగయ్య మాట్లాడుతూ... మండలంలో నాలుగు బృహత్తర పల్లె ప్రకృతి వనాలు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ వీణ మాట్లాడుతూ... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దీపా, ఎంపీడీవో గోపాల్‌ రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు గజేందర్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T07:12:38+05:30 IST