సింప్లీ సిట్టింగ్‌ స్వామి

ABN , First Publish Date - 2020-10-27T05:30:00+05:30 IST

ఓ గుడికి కొత్తగా పాలకవర్గం ఎన్నికయింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఎవరు ఏమేం పనులు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నాడు. పూజారి,

సింప్లీ సిట్టింగ్‌ స్వామి

ఓ గుడికి కొత్తగా పాలకవర్గం ఎన్నికయింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఎవరు ఏమేం పనులు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నాడు. పూజారి, పనిమనిషి, వాచ్‌మెన్‌... ఇలా అందరినీ కనుక్కున్నాడు. అందరూ వారి వారి పనులను సరిగ్గా చేస్తున్నారు. వారందరి అవసరం కూడా ఉంది అనుకున్నాడు.కానీ దేవుడి ప్రసాదం తింటూ, గుళ్లోనే పడుకుంటున్న సింప్లీ సిట్టింగ్‌ స్వామి అనే సన్యాసి మాత్రం ఏ పనీ చేయడం లేదని తెలుసుకుని అతణ్ణి పిలిపించాడు. ‘‘నీవల్ల గుడికి ఏం లాభం లేదు. ఇకముందు నీకు ఇక్కడ ప్రసాదం పెట్టం. ఇంకెక్కడికైనా వెళ్లు’’ అని ఆదేశించాడు.


‘‘అది అన్యాయం. నేను అందరికన్నా కష్టమైన పనిచేస్తున్నాను’’ అన్నాడు స్వామి. ‘‘కష్టమైన పనా? నువ్వసలు ఏ పనీ చేయడం లేదుగా?’’ అన్నాడు కోపంగా అధ్యక్షుడు. ‘‘అదెంత కష్టమో మీకు అర్థం కావడం లేదు. మీరోపూట ఏ  పనీ చేయకుండా ఖాళీగా కూర్చోండి. అది తేలికని మీకనిపిస్తే మీరు చెప్పినట్టు చేస్తాను’’ అన్నాడు స్వామి. సరేనన్న అధ్యక్షుడు మరుసటి రోజు ఉదయం నుంచి ఇంట్లో ఏ పనీ చేయకుండా ఓ గదిలో కూర్చున్నాడు. గంటకు మించి కూర్చోవడం ఆయన వల్ల కాలేదు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం అంత సులభం కాదని గ్రహించిన అధ్యక్షుడు సింప్లీ సిట్టింగ్‌ స్వామిని గుళ్లోనే ఉండనిచ్చాడు.


పంపిన వారు : బత్తిన గ్రీష్మ


Updated Date - 2020-10-27T05:30:00+05:30 IST