రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ

ABN , First Publish Date - 2022-05-22T05:49:54+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ
రచ్చబండలో పాల్గొన్న శ్రీధర్‌బాబు

- వెంకటాపూర్‌ రచ్చబండలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

మంథనిరూరల్‌, మే 21: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోస కింద కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ. 15 వేలు పెట్టుబడి సాయం,  ఈజీఎస్‌ కూలీలకు సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.  పండించిన పంటలకు రైతులకు ఎంఎన్‌పీ ధరల కంటే అధికంగా కొనుగోలు చేస్తామన్నారు. మూతబడిన చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.   రాష్ట్రంలో రైతులకు రైతు బంధు తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. నకిలీ విత్తనాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. మండలంలోని భట్టుపల్లి, బిట్టుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:49:54+05:30 IST