జన సంద్రం

ABN , First Publish Date - 2021-02-28T06:57:02+05:30 IST

మాఘపౌర్ణమి సందర్భంగా హంసలదీవి బీచ్‌ జనసంద్రంగా మారింది. లక్ష మందికిపైగా ప్రజలు సింధు స్నానాలు చేసేందుకు తరలివచ్చారు.

జన సంద్రం

లక్ష మందికిపైగా సింధు స్నానాలు

కోడూరు, ఫిబ్రవరి 27 :  మాఘపౌర్ణమి సందర్భంగా హంసలదీవి బీచ్‌ జనసంద్రంగా మారింది. లక్ష మందికిపైగా ప్రజలు సింధు స్నానాలు చేసేందుకు తరలివచ్చారు. దంపతులు బ్రహ్మముడులతో సాగరుని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. పాలకాయితిప్ప నుంచి సముద్ర తీరం వరకు సింగిల్‌ రోడ్డు రహదారి కావటంతో సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. తహసీల్దార్‌ లతీఫ్‌ పాషా, ఈవో యలవర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో సీఐలు బి.బి.రవికుమార్‌, ఎన్‌.వెంకట నారాయణ, కోడూరు ఎస్సై పి.రమేష్‌ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిం చారు. మచిలీపట్నం మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ట్రాఫిక్‌ను క్రమబద్దీక రించారు. సాగరసంగమం వద్దకు వెళ్లేందుఉ అనుమతులు ఇవ్వక పోవటంతో భక్తులు కొంత నిరాశకు గురయ్యారు.  మెరైన్‌ సీఐ వల్లభనేని పవన్‌ కిషోర్‌ నేతృత్వంలో ఎస్సై ఎన్‌.ఎస్‌.నాయుడు, జిలాని భక్తుల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం తిలకించి కృష్ణాసాగర సంగమం, సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించటం పూర్వజన్మ సుకృతమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌భాబు తెలిపారు. సముద్రతీరంలో ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను కుటుంబసమేతంగా ఆయన తిలకించారు. సముద్రునికి ప్రత్యేక పూజ లు చేశారు. ఎమ్మెల్యేతోపాటు దివి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుణ్యస్నానా ల ఏర్పాట్ల గురించి తహసీల్దార్‌ లతీఫ్‌ పాషాను ఆర్డీవో ఖాజావలి అడిగి తెలుసుకున్నారు.  

Updated Date - 2021-02-28T06:57:02+05:30 IST