
ఫైనల్లో ప్రణయ్ ఓటమి
బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ మునుపటి ఫామ్‌లోకొచ్చింది. ఈ ఒలింపిక్ పతక విజేత స్విస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరి ఆశలు రేపిన భారత సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ రన్నర్‌పతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సింధు 21-16, 21-8తో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగోసీడ్ బుసానన్ ఓన్గ్బారున్ఫాన్ను చిత్తుచేసి ట్రోఫీ అందుకుంది.
నిరుడు ఇక్కడ కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలై రన్నర్పకే పరిమితమైన సింధు.. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఫలితాన్ని రాబట్టింది. ఈ సీజన్లో సింధుకు ఇది రెండో టైటిల్. జనవరిలో సయ్యద్ మోదీ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల తుదిపోరులో ప్రణయ్ 12-21, 18-21తో ఇండోనేసియా స్టార్, నాలుగోసీడ్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓటమి పాలయ్యాడు. కేరళకు చెందిన 29 ఏళ్ల ప్రణయ్‌కు గత ఐదేళ్లలో ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ కావడం గమనార్హం.
మోదీ అభినందన:
టైటిల్ గెలిచిన సింధును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.