సెప్టెంబరు 28, 29 తేదీల్లో... సింగపూర్ ‘బిజినెస్ ఎక్స్‌పో’...

Published: Wed, 20 Apr 2022 19:56:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సెప్టెంబరు 28, 29 తేదీల్లో...  సింగపూర్ బిజినెస్ ఎక్స్‌పో...

సింగపూర్ : అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన  ప్రముఖ వ్యాపార కార్యక్రమం(బిజినెస్ షో) సెప్టెంబరు 28, 29 తేదీల్లో జరగనుంది. ‘బిజినెస్ ఎక్స్‌పో షో 2022’ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని సింగపూర్ దక్కించుకుంది. ఈ ప్రముఖ ఈవెంట్ పాతిక సంవత్సరాలుగా కొనసాగుతోంది. అంతేకాకుండా... వేల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సహా వ్యాపార నిర్ణయాధికారులు ఈ షోలో పాల్గొననున్నారు. సింగపూర్‌ ఆర్థిక వ్యవస్థ మరింత ఉత్తేజం పొందడానికి ఈ ‘షో’ను కీలకంగా భావిస్తారు. అంతేకాకుండా... సింగపూర్ ప్రముఖ ప్రపంచ వ్యాపార శక్తి కేంద్రమని ప్రపంచానికి గుర్తు చేయడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం. ‘ఈ ఈవెంట్ మా వ్యాపార యజమానులకు ఎప్పటికప్పుడు ఓ ధీటైన  ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా... ఇది ఆర్థిక వృద్ధికి కిక్ స్టార్టర్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది’ అని సింగపూర్ నేతలు పేర్కొంటున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.