భారతీయులకు Singapore గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-03-04T22:06:26+05:30 IST

భారత పౌరులకు సింగపూర్ శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలను సడలిస్తున్నట్టు వెల్లడించింది. సవరించిన కొవిడ్ నిబంధనలు ఈ నెల 16 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ఇం

భారతీయులకు Singapore గుడ్‌న్యూస్

ఎన్నారై డెస్క్: భారత పౌరులకు సింగపూర్ శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలను సడలిస్తున్నట్టు వెల్లడించింది. సవరించిన కొవిడ్ నిబంధనలు ఈ నెల 16 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి రూపాలు మార్చకుంటూ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాలన్నీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కఠినంగా లాక్‌డౌన్‌లను అమలు చేశాయి. అయితే కొంత కాలంగా కరోనా ఉధృతి కాస్తా తగ్గింది. దీంతో చాలా దేశాలు ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నాయి. ఇందులో భాగంగానే సింగపూర్ కూడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సింగపూర్ వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. అయితే.. సింగపూర్ ఈ నిబంధనను ఎత్తేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టిన తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. మార్చి 16 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్టు సింగపూర్ సీనియర్ మంత్రి ఓ మీడియా సమావేశంలో చెప్పారు. 




Updated Date - 2022-03-04T22:06:26+05:30 IST