భారత సంతతి ఫుట్‌బాలర్‌, రెఫరీలపై సింగపూర్‌లో జీవితకాల నిషేధం ఎత్తివేత..!

ABN , First Publish Date - 2022-03-20T00:54:48+05:30 IST

భారతీయ సంతతికి చెందిన మాజీ ఫుట్‌బాలర్, రెపరీలపై గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని సింగపూర్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తాజాగా తొలగించింది.

భారత సంతతి ఫుట్‌బాలర్‌, రెఫరీలపై సింగపూర్‌లో జీవితకాల నిషేధం ఎత్తివేత..!

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన మాజీ ఫుట్‌బాలర్, రెపరీలపై గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని సింగపూర్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తాజాగా తొలగించింది. నిషేధాన్ని ఎత్తేయాలంటూ 2021లో వారు చేసుకున్న అప్పీలును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు కేసులకు సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని పేర్కొన్నారు. 


కాగా.. 1994లో ప్రీమియర్ లీగ్‌లో మలేషియాతో జరిగే ఓ మ్యాచ్ సందర్భంగా సింగపూర్ ఫుట్‌బాట్ క్రీడాకారుడికి కన్నన్ లంచం ఇవ్వజూపాడన్న నేరం రుజువవడంతో అతడిపై ఫుట్‌బాల్ అసోసియేషన్ జీవితకాల నిషేధం విధించింది. ఇక ఫుట్‌బాల్ బుక్‌మేకర్ నుంచి మ్యాచ్ ఫలితాన్ని అతడికి అనూకూలంగా మార్చేందుకు లంచం తీసుకున్నాడన్న అభియోగంపై రెఫరీ రాజమాణిక్యాన్ని కూడా ఫుట్‌బాల్ అసోసియేషన్ నిషేధించింది. ఆ సమయంలో కోర్టు ఇద్దరు నిందితులకు జరిమానాతో పాటూ జైలు శిక్ష కూడా విధించింది.


తమపై నిషేధాన్ని ఎత్తేయాలంటూ నిందితులు 2021లో అర్జీ పెట్టుకోవడంతో తాజాగా వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. అయితే.. అవినీతిని ఉపేక్షించినట్టుగా ఈ నిర్ణయాన్ని చూడరాదని ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిషేధానికి సంబంధించి అన్ని అంశాలను, కోర్టు తీర్పును పరిశీలించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఫుట్‌బాల్ అసోసియేషన్ రాజ్యాంగం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే నిందితులిద్దరూ దాదాపు 26 ఏళ్లుగా క్రీడకు దూరంగా ఉన్నారని పేర్కొంది. 

Updated Date - 2022-03-20T00:54:48+05:30 IST