India Covid crisis: దేశంలోకి విదేశీ వర్కర్ల ప్రవేశంపై సింగపూర్ ఆంక్షలు!

ABN , First Publish Date - 2021-05-09T14:56:07+05:30 IST

భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ నేపథ్యంలో సింగపూర్ రాబోయే రోజుల్లో తమ దేశంలోకి ప్రవేశించే విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించే దిశగా పావులు కదుపుతోంది.

India Covid crisis: దేశంలోకి విదేశీ వర్కర్ల ప్రవేశంపై సింగపూర్ ఆంక్షలు!

సింగపూర్ సిటీ: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ నేపథ్యంలో సింగపూర్ రాబోయే రోజుల్లో తమ దేశంలోకి ప్రవేశించే విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించే దిశగా పావులు కదుపుతోంది. భారత్‌తో పాటు హైరిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వర్కర్లు తమ దేశంలోకి ప్రవేశించడానికి ఇకపై తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుందని సింగపూర్ మ్యాన్‌పవర్ మినిస్ట్రీ వెల్లడించింది. వర్క్ పాస్‌లు కలిగిన హైరిస్క్ దేశాలకు చెందిన కార్మికులకు సింగపూర్‌లో ప్రవేశించే విషయంలో మంగళవారం(మే 11) నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, వేర్వేరు రంగాలకు చెందిన కార్మికులకు వేర్వేరు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.  

Updated Date - 2021-05-09T14:56:07+05:30 IST