COVID-19 safety measures: రెసిడెన్సీ పర్మిట్ క్యాన్సిల్ చేస్తామంటూ సింగపూర్ వార్నింగ్!

ABN , First Publish Date - 2021-08-01T14:25:20+05:30 IST

కొత్తగా తీసుకువస్తున్న కరోనా సెఫ్టీ నిబంధనల విషయమై శాశ్వత నివాసదారులు, దీర్ఘకాలిక పాస్ హోల్డర్లను సింగపూర్ హెచ్చరించింది.

COVID-19 safety measures: రెసిడెన్సీ పర్మిట్ క్యాన్సిల్ చేస్తామంటూ సింగపూర్ వార్నింగ్!

సింగపూర్ సిటీ: కొత్తగా తీసుకువస్తున్న కరోనా సెఫ్టీ నిబంధనల విషయమై శాశ్వత నివాసదారులు, దీర్ఘకాలిక పాస్ హోల్డర్లను సింగపూర్ హెచ్చరించింది. కొవిడ్-19 భద్రతా నిబంధనలు పాటించకపోతే రెసిడెన్సీ పర్మిట్లు, పాస్‌లను రద్దు చేస్తామని పర్మినెంట్ రెసిడెంట్స్‌ను సింగపూర్ ఆరోగ్యశాఖ శనివారం గట్టి వార్నింగ్ ఇచ్చింది. దేశ సరిహద్దులో గుండా ఆస్ట్రేలియాతో పాటు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ నుంచి వచ్చే ప్రయాణికులకు ట్రావెల్ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో తాజాగా సింగపూర్ ఆరోగ్యశాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది. సింగపూర్‌లో కరోనా కొత్త నిబంధనలు సోమవారం రాత్రి 11.59 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. దీనిలో భాగంగా గడిచిన 21 రోజుల్లో ఆస్ట్రేలియాతో ట్రావెల్ హిస్టరీ ఉన్న ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు స్టేహోం పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే సింగపూర్‌లో ఎంట్రీ కావాలంటే జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించడం తప్పనిసరి అన్నారు.   

Updated Date - 2021-08-01T14:25:20+05:30 IST