భారత్, పాక్, బంగ్లాదేశీయులకు సింగపూర్ శుభవార్త

ABN , First Publish Date - 2021-10-24T00:53:35+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రయాణాలపై

భారత్, పాక్, బంగ్లాదేశీయులకు సింగపూర్ శుభవార్త

సింగపూర్ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రయాణాలపై అమలు చేసిన ఆంక్షల జాబితాను సింగపూర్ సవరించింది. భారత దేశం, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలను ఈ ఆంక్షల జాబితా నుంచి తొలగించింది. ప్రయాణికులు ఈ దేశాల నుంచి సింగపూర్‌ చేరుకున్న తర్వాత క్వారంటైన్ కేంద్రంలో బస చేయవలసి ఉంటుందని తెలిపింది. 


సింగపూర్ బయల్దేరే రోజుకు ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీ కలిగిన భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపింది. సవరించిన ఈ నిబంధనలు అక్టోబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ప్రయాణికులు కేటగిరి -4 బోర్డర్ నిబంధనల పరిధిలోకి వస్తారని పేర్కొంది. ఈ దేశాల్లో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించిన అనంతరం సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కేటగిరి -4 బోర్డర్ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు సింగపూర్ చేరుకున్న తర్వాత 10 రోజులపాటు ఓ కేంద్రంలో క్వారంటైన్‌లో ఉండాలి. 


Updated Date - 2021-10-24T00:53:35+05:30 IST