సాధించింది అంతంత మాత్రమే..

ABN , First Publish Date - 2021-02-27T05:24:29+05:30 IST

సాధించింది అంతంత మాత్రమే..

సాధించింది అంతంత మాత్రమే..
భూపాలపల్లి ఏరియాలోని ఓసీ-2

వార్షిక లక్ష్యం 38,90,000 టన్నులు

 6,63,401 టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి

కాకతీయఖని, ఫిబ్రవరి 26: సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 38,90,000 టన్నుల బొగ్గు ఉత్పిత్తి వార్షిక లక్ష్యాన్ని (1ఏప్రిల్‌ 2020- 31మార్చి 2021) నిర్దే శించింది.  అయితే 24 ఫిబ్రవరి 2021 నాటికి 16,63,401 టన్నుల బొగ్గును మాత్రమే సాధించింది.  టార్గెట్‌ పూర్తి చేసేందుకు  ఇంకా 33 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కొద్ది రోజుల్లో 22,26,598 టన్నుల లక్ష్యాన్ని సాధిస్తా రా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాల పల్లి ఏరియాలో నాలుగు అండర్‌గ్రౌండ్‌ గనులు, రెండు ఓపెన్‌కాస్ట్‌ గనులు ఉన్నాయి. అయితే సింగరేణి యాజ మాన్యం కేటీకే 1, కేటీకే 5, కేటీకే 8 అండర్‌ గ్రౌండ్‌ గను లకు సంవత్సరానికి 4,00,000 టన్నులు, కేటీకే 6వ గనికి 2 లక్షల 40 వేల టన్నులు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌-2కు 15 లక్షల టన్నులు, ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌ -3కు 9 లక్షల 50 వేల టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

11 నెలల్లో లక్ష్య సాధన ఇలా..

కేటీకే 1వ గనికి నిర్దేశించిన లక్ష్యం 3,63,125 టన్ను లకు 2,18,53 టన్నులు సాధించారు. ఇంకా 1,81,463 ట న్నుల ఉత్పత్తి సాధనలో వెనుక పడి ఉంది. అలాగే  కేటీకే 5వ గనికి ఇచ్చిన లక్ష్యం 363,125 టన్నులకు 1,83,050 టన్నులు సాధించి 2,16,950 టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడి ఉంది. అదే విధంగా కేటీకే 8వ గని 3,63,125 టన్నుల లక్ష్యానికి 1,84,823 టన్నులు సాధించి 2,15,177 టన్నుల ఉత్పత్తి సాధలో వెనుకపడి ఉంది. అలాగే  కేటీకే 6వ గని 2,17,625 టన్నుల లక్ష్యా నికి 1,27,842టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 1,12,158 టన్నుల ఉత్పత్తి సాధలో వెనుకపడి ఉంది. అలాగే ఓసీ -2 12,97,500 లక్ష్యానికి 9,49,149 టన్నులు సాధించి 5,50,850 టన్నుల ఉత్పత్తి సాధనలో వెనుకపడి ఉంది. ఓసీ-3 8,16,250 లక్ష్యానికి ఇప్పటి వరకు బొగ్గు ఉత్ప త్తిని చేపట్టలేదు.  

 ఉత్పత్తిపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావంతో ఏరియాలోని అండర్‌గ్రౌండ్‌ గను లకు గత సంవత్సరం 1 ఏప్రిల్‌ నుంచి 20 మే వరకు సుమారు 51రోజుల పాటు సింగరేణి యాజమాన్యం లే ఆఫ్‌ను ప్రకటించింది.  దీంతో ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌-2లో మినహా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో ఉత్పత్తి లక్ష్యం పెను భారంగా మారింది. 

 అధికారుల పాట్లు

లాభాలను గడించాలంటే యాజమాన్యం ఇచ్చిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిం చాల్సి ఉండగా భూపాల పల్లి ఏరియా వెనుకబడి ఉంది. టార్గెట్‌ను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధిక ఉత్పత్తిని సాధించేందుకు సింగరేణి అధికారులు గనులపై కౌన్సెలింగ్‌ నిర్వహి స్తున్నారు. కార్మికుల పని గంటల ను సరిగా వినియోగించుకొని అధిక ఉత్పత్తిని సాధిం చేందుకు తాకీదు చేస్తున్నారు.

నష్టాల్లో ఏరియా..

భూపాలపల్లి ఏరియా నష్టాల్లో నడుస్తుందని ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌ పలు కార్యక్రమాల్లో ప్రకటించారు. అయితే ఒక వైపు కార్మికుల గైర్హు హాజరు మరోవైపు కరోనా ప్రభావంతో ఉత్పత్తికి తీరని ఆటంకం కలిగిందని తెలిపారు. దీంతో ఏరియా రూ. 83,25,65,709 నష్టాలో నడుస్తోంది.  ఇలాగే కొనసాగితే ఏరియా మనుగడకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-02-27T05:24:29+05:30 IST