రేపటి నుంచి సింగరేణి కార్మికసంఘాల పోరుబాట

ABN , First Publish Date - 2022-07-07T05:00:23+05:30 IST

సింగరేణి కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికసంఘాలు ఉద్యమాలకు సిద్దమవుతున్నాయి..

రేపటి నుంచి సింగరేణి కార్మికసంఘాల పోరుబాట

రుద్రంపూర్‌, (సింగరేణి) జూలై 6: సింగరేణి కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికసంఘాలు ఉద్యమాలకు సిద్దమవుతున్నాయి.. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుర్తింపు కార్మికసంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈనెల8 నుంచి 18వరకు దశల వారీ పోరాటాలకు ప్రణాళిక రూపొందించింది. గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరలో జరుగుతాయని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రధాన కార్మికసంఘాలన్నీ ఉద్యమాలకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. ఈనెల 11న నిరవధిక నిరాహారదీక్ష చేయడానికి నిర్ణయించారు.  తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈనెల 8న సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి 12న సింగరేణిలోని 11 ఏరియాల్లో జనరల్‌ మేనేజరు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాలను జీఎంలకు అందజేయనున్నారు. 18న సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. సీఐటీయూ నిరాహారదీక్షలో, గుర్తింపు కార్మికసంఘం  ఆందోళనలతో సింగరేణిలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

Updated Date - 2022-07-07T05:00:23+05:30 IST