ఆ కూతురు క్షేమంగా తల్లికి దక్కాలంటే...

May 22 2021 @ 17:13PM

మా అమ్మకు తోడుగా ఉండి అండగా నిలబడాలని ఎన్నెన్నో కలలు కన్నాను.


అమ్మ ఇప్పటివరకూ ఎన్నో కష్టాలు పడింది. మరణించిన నా తండ్రి కారణంగా ఏళ్ళ తరబడి ఎన్నో వేధింపులకు గురైన అమ్మకు మంచి జీవితాన్ని అందించాలనుకున్నాను. కానీ, కలలు ఎంత త్వరగా కల్లలైపోతాయో నాకు విధి ఈ మధ్యనే తెలియజేసింది.


ఎందుకంటే, నేను ప్రాణాంతకమైన రక్త సంబంధమైన రోగానికి గురయ్యాను.


పరీక్షల్లో ఈ విషయం తెలియడానికి కొద్ది వారాల ముందు నుంచే నేను అనారోగ్యం పాలవుతూ వచ్చాను.


తరచుగా బలహీనపడుతూ వచ్చాను. బాగా సుస్తీ చేసింది. ఎంతగా అంటే, కనీసం లేచి మంచినీరు తాగాలన్నా చాలా అలసటగా ఉండేది. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే... కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అన్నంత భయం వేస్తుండేది.


రోజులు గడుస్తున్న కొద్దీ నా పరిస్థితి మరింత దిగజారిపోతూ వచ్చింది. తల తిప్పుతూ మంచం మీద కూర్చోవడమే కష్టంగా మారిపోయింది.


ఇంకా, ముక్కులోంచి రక్తం కారడం మొదలైంది.


కొన్నేళ్ళ కిందట నా స్నేహితురాలు ఒకమ్మాయికి కూడా ఇలా ముక్కులోంచి రక్తం కాలేదు. బహుశా వేడి చేసి లేదా అలసిపోవడం వల్ల అలా జరిగిందనుకున్నాను.

నేను తప్ప నా తల్లికి మరో అండ లేదు. నన్ను, నా తోబుట్టువులను పోషించడానికి ఎంతో శ్రమపడుతోంది. అమ్మకు పని దొరకడమే కష్టంగా మారింది.


ఒక చిన్న చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటేనే ఎంతో ఖర్చవుతుందని, అది అమ్మ భరించలేదని నాకు తెలుసు. అందువల్ల ఇంట్లో నా జాగ్రత్త నేనే చూసుకుంటూ ఉండటమే అమ్మకు నేను చెయ్యగలిగిన మేలని అనిపించింది.


కానీ, తర్వాత నా పెదవుల్లోంచి కూడా రక్తం కారుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయిందని నాకు అర్థమైంది. అమ్మతో సహా అందరూ అప్రమత్తమయ్యారు.


ఏం జరిగిందో గ్రహించిన అమ్మ, వెంటనే కొందరు పొరుగువారిని పిలిచి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి సాయం కోరింది.


ఆస్పత్రిలో వరుసగా టెస్టులు, స్కానింగులు చేశారు. చివరికి నాకు రక్త సంబంధమైన వ్యాధి aplastic anaemia తీవ్రస్థాయిలో ఉందని తేలింది.


నా ప్రాణాలు రక్షించడానికి డాక్టర్లు వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టారు.


కానీ అది సరిపోలేదు.


ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే, అది రక్త కణాల్ని సరిగ్గా పనిచెయ్యనివ్వని అరుదైన జబ్బు. దాని వల్ల నాకు రక్తస్రావం ఎక్కువగా అవుతుంది, అలసటే అలసట.


నేను క్షేమంగా బయట పడాలంటే నాకు వీలైనంత త్వరగా బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ జరగాలి. ఇందుకు సుమారు రూ.30 లక్షలు ($ 40332.15) ఖర్చవుతుంది.


విరాళాలు ఇవ్వదలచిన వారు ఇక్కడ క్లిక్ చేయండి.


నాకు కీమోథెరపీ కోసం అయ్యే ఖర్చు భరించడానికి మాకున్నదంతా అమ్మేశాం. దీనికే రూ.5 లక్షలకు పైగా ఖర్చయ్యింది.


ఇప్పుడు మాదగ్గర ఇంకేమీ లేదు. మా నాన్న చనిపోయాక మాకు సాయమన్న మాటే లేదు. నేను క్షేమంగా బయటకు రావడానికి అవసరమైన ఈ ట్రాన్స్‌ప్లాంట్ ఖర్చును మేం ఎంత మాత్రం భరించే పరిస్థితి లేదు.


ఉదార హృదయంతో మీరు చేసే సహాయం పైనే నేను ఆశ పెట్టుకున్నాను. నా జీవితం చేజారకుండా చూడండి.


మా అమ్మకు, నా తోబుట్టువులకు నేను ఏమైనా చెయ్యడానికి దయచేసి నేను కోలుకునేలా చేయూతనివ్వండి. మీ సాయంతో నేను కష్టపడి పని చేసుకుని, నా కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందిస్తాను.


పెద్ద మనసుతో సాయపడి నన్ను కాపాడండి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.