భారీగా పెరిగిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌

ABN , First Publish Date - 2020-07-07T07:50:06+05:30 IST

కరోనా వ్యాప్తికి ముందు దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడులక సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీని వినియోగంపై ఆందోళన...

భారీగా పెరిగిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌

డెహ్రాడూన్‌, జూలై 6: కరోనా వ్యాప్తికి ముందు దేశవ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడులక సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీని వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సింగిల్‌ ప్లాస్టిక్‌ ఉపయోగంపై దేశవ్యాప్తంగా ఒక రకమైన వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. అయితే ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి వాడుతున్న పరికరాలు అధిక శాతం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో తయారవుతున్నాయని, ఇది ఆందోళనకు గురిచేస్తున్నదని పర్యావరణవేత్త అనూప్‌ నౌటియాల్‌ సోమవారం అన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా బట్టతో చేసిన మాస్క్‌లు, గ్లౌజుల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.


Updated Date - 2020-07-07T07:50:06+05:30 IST