సింగూరు ప్రాజెక్టులో రోజు రోజుకు పెరుగుతున్న నీటి నిల్వ

ABN , First Publish Date - 2020-09-23T14:05:11+05:30 IST

భారీ వర్షాల కారణంగా సింగూర్ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది.

సింగూరు ప్రాజెక్టులో రోజు రోజుకు పెరుగుతున్న నీటి నిల్వ

సంగారెడ్డి: భారీ వర్షాల కారణంగా సింగూర్ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 19.429 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టులోకి  నీటి ఇన్ ఫ్లో 8245 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 60 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి ఆవిరి, లికేజ్ ద్వారా 60 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టులో మొత్తం నీటి ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2020-09-23T14:05:11+05:30 IST