Viral Video: బర్త్ డే పార్టీలో ఆనందంతో చిందులేస్తున్న మహిళలు.. అకస్మాత్తుగా ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-10-04T00:16:50+05:30 IST

అదృష్టాలే కాదు ఆపదలు కూడా అనుకోకుండానే వస్తాయి. బర్త్ డే పార్టీలో ఆనందంతో చిందులు వేస్తుండగా.. అకస్మాత్తుగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జ

Viral Video: బర్త్ డే పార్టీలో ఆనందంతో చిందులేస్తున్న మహిళలు.. అకస్మాత్తుగా ఊహించని సీన్.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టాలే కాదు ఆపదలు కూడా అనుకోకుండానే వస్తాయి. బర్త్ డే పార్టీలో ఆనందంతో చిందులు వేస్తుండగా.. అకస్మాత్తుగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పుట్టిన రోజు వేడుకలను ప్రస్తుతం జనాలు అంగరంగ వైభంగా జరుపుకొంటున్నారు. ఆటాపాటలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రెజిల్‌‌కు చెందిన కొంత మంది మహిళలు.. ఓ పుట్టిన రోజు వేడకకు హాజరయ్యారు. అనంతరం సంతోషంతో స్టెప్పులేయడం ప్రారంభించారు. గాల్లోకి ఎగురుతూ ఆనందపడ్డారు. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వాళ్లు చిందులు వేసే ప్రదేశంలో ఏదైనా డ్రైనేజీ కాలువ ఉందో ఏమో తెలియదు కానీ.. అకస్మాత్తుగా భూమి కుంగిపోయి.. పెద్ద రంధ్రం ఏర్పడింది. డ్యాన్స్ చేసే మహిళలంతా ఆ సింక్‌హోల్‌లో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం ఇటువంటి ఘటనే ఇజ్రాయెల్‌లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో కొందరు సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే.. అకస్మాత్తుగా సింక్ హోల్ ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లతోపాటు అందులో ఈత కొడుతున్న 34ఏళ్ల కిమ్హి అనే వ్యక్తి కూడా సింక్ హోల్‌లోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయాడు. 




Updated Date - 2022-10-04T00:16:50+05:30 IST