అయితే, కారు ఆగి ఉన్న చోట కిందవైపు సింక్‌హోల్(డ్రైనేజీ లైన్) ఉండడం.. పైన ఉన్న నేల కాస్తా బలహీనపడడంతో ఒక్కసారిగా అది లోపలికి కూలిపోయింది. ఈ ఘటనను టాప్జీ ప్రత్యక్షంగా చూశారు. "నిజంగా ఇది షాకింగ్ ఘటన. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది." అని టాప్జీ తెలిపారు. కారును సింక్‌హోల్ మింగేసిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను టాప్జీ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.