సార్‌.. మిము మరువం

ABN , First Publish Date - 2022-08-07T06:25:48+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొపెసర్‌ జయశంకర్‌ సార్‌ తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి అని, ఆయన లైఫ్‌ టైం ఉద్యకారుడని రాష్ట్ర మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. మండలంలోని చౌట్‌పల్లిలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన జయంతి సందర్భంగా

సార్‌.. మిము మరువం
చౌట్‌పల్లిలో ప్రొ.జయశంకర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళ్లర్పిస్తున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

కమ్మర్‌పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపన

కమ్మర్‌పల్లి, జూలై 6: తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రొపెసర్‌ జయశంకర్‌ సార్‌ తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి అని, ఆయన లైఫ్‌ టైం ఉద్యకారుడని రాష్ట్ర మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. మండలంలోని చౌట్‌పల్లిలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అనంతరం కోనాసముందర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేశారు. అంతకుముందు, కమ్మర్‌పల్లిలో  203 మహిళ సంఘాలకు మంజూరైన 15.26 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణా ల చెక్కులను ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి లాంఛనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అరకొరగా రుణాలు అందేవని, కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక రూ.లక్షల్లో రుణాలు అందజేశారని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్‌ లు, బ్యాంక్‌ లింకేజీ రుణాలు, స్త్రీనిధి, వరి కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెర్ఫ్‌ శాఖ ద్వారా అమలు కావడం సంతోషకరమన్నారు. భారీగా రుణాలు ఇవ్వడంతో  ఒక్క కమ్మర్‌పల్లి మండలంలోనే ఎక్కువ మంది మహిళ లు ఆర్థికాభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తోందని, ఇందు లో వంద శాతం నిజమన్నారు. కేవలం అధికారం కోసం తప్పడు ఆరోపణలు చేస్తూ దేవుడి పేర ఓట్ల కోసం వస్తున్న వారిని ప్రజలు, మహిళలు నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమిసుమన్‌ , జడ్పీటీసీ రాధారాజగౌడ్‌, మండల పార్టీ అద్యక్షుడు రేగుంట దేవేందర్‌, సర్పంచ్‌లు గడ్డం స్వామి, మారుశంకర్‌, ఇంద్రాల రూపరాజు, వైస్‌ ఎంపీపీ కాలేరి శేఖర్‌, రైతుబంధు కన్వినర్‌ బద్దం రాజేశ్వర్‌, బద్దం చిన్నరెడ్డి,  ప్రకాశ్‌ నాయక్‌, ఎంపిడివో సంతోష్‌రెడ్డి ఆర్డివో శ్రీనివాసులు, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సురేష్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-08-07T06:25:48+05:30 IST