నా పాటకు రేటు ఇంత అనే మాట నా నోట రాలేదు.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల

Nov 30 2021 @ 16:35PM

ఆర్కే: మీకు సిగరెట్‌ ఎలా అలవాటైంది?

సిరివెన్నెల: మా తరంలో వాళ్లకి సిగరెట్‌ కాల్చడం ఫ్యాషన్‌. నా వ్యసనం కూడా అలాగే మొదలైంది. ఇంత అహంకారినైన నేను ప్రతిసారీ ఒక సిగరెట్‌ ముందు తలవంచుతున్నాను. నాకు చేతగాకనే ఈ వ్యసనాన్ని వదల్లేకపోతున్నాను.


ఆర్కే: ‘ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి’ అనుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది?

సిరివెన్నెల: అత్యధిక పారితోషికం అంటే.. అది ఒకరకమైన అపోహే. నా పాటకు రేటు ఇంత అనే మాట నా నోట రాలేదు.


ఆర్కే: ఇప్పటి పాటలకు సీతారామశాస్త్రి అవసరం లేదేమో..

సిరివెన్నెల: ‘‘ఇప్పటి’’ అంటే.. ఒకప్పుడు చిత్రసీమ ఇంతకంటే అద్భుతంగా ఏమీ లేదు. ‘బలపం పట్టి భామ బళ్లో..’ రాసినవాణ్ని నేనే కదా. ఇప్పుడు రాయలేనా.


ఆర్కే: ఇండస్ట్రీలో మీ శిష్యుల పురోగతి ఎలా ఉంది?

సిరివెన్నెల: శిష్యులని అనడం వాళ్ల సంస్కారం. వాళ్లకు నేను నేర్పిందేమీ లేదు. వాళ్లని తమ్ముళ్లుగానో, బిడ్డలుగానో, కూతుళ్లుగానో చూస్తాను.


ఆర్కే: మీ ముందు తరంలో మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు?

సిరివెన్నెల: ప్రతిరంగంలోనూ అందరిలోనూ అంతా గొప్పే ఉండదు. ఆయా విద్యలో ఉండే అద్భుతత్వాన్ని గ్రహిస్తానే తప్ప.. నాకు నటుల్లోగానీ, రచయితల్లోగానీ ‘ఒకళ్లు’ అంటూ నాకెవరూ లేరు. అయినా నా తత్వ దృష్టి కోణంలోంచి ఆలోచిస్తే నాకు ఒక్కళ్లే అంటే.. విశ్వనాథ సత్యనారాయణ తప్ప ఎవరూ లేరు. ప్రతిభాపరంగా చూస్తే.. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, సి.నారాయణరెడ్డి.. నా సమకాలీకుల్లో కూడా చాలా మందే ఉన్నారు. అలాగే.. చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, భాస్కరభట్ల.

Follow Us on:

సినీ ప్రముఖులుమరిన్ని...

ప్రత్యేకం మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.