
ఒకవైపు ఇంట్లో ఒక యువకుడు మరణించగా.. మరోవైపు అదే ఇంట్లో నుంచి మృతుడి సోదరి కనబడకుండాపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
రాజస్థాన్‌లోని కోటా నగరంలో నివసించే మాధురి(18, పేరు మార్చబడినది) అనే యువతి సోదరుడు ఇటీవల ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో విషాదంలో ఉండగా.. మాధురి మాత్రం తనకేమీ పట్టనట్టుగా ఇంటి నుంచి పారిపోయింది. కొడుకు పోయిన దు:ఖంలో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని అప్పటికప్పుడు గమనించలేదు.
మృతదేహం అంతక్రియలు జరిగాక.. ఇంట్లో చూస్తే మాధురి కనబడలేదు. ఊరంతా వెతికినా ఆమె ఆచూకీ కనబడపోయేసరికి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధురి మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు అనుకోకుండా ఒక విషయం తెలిసింది. అదే ఇంట్లో పనిచేసే రాకేశ్(పేరు మార్చబడినది) ఒక యువకుడు కూడా ఆ రోజు నుంచే పని చేయడానికి రావడం లేదు.
పోలీసులు రాకేశ్ గురించి దర్యాప్తు చేయగా.. అతని ఫోన్ లొకేషన్ ద్వారా అతని ఆచూకీ తెలిసింది. పోలీసులు రాకేశ్ కోసం వెళ్లగా.. అతనితో పాటు మాధురి కూడా దొరికిపోయింది. దీంతో అక్కడ సీన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మాధురి, రాకేశ్ ఇంట్లో నుంచి పారపోయి పెళ్లిచేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం మాధురి తన ఇంట్లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే రాకేశ్‌ని ప్రేమించింది. వారి ప్రేమకు ఆస్తి అంతస్తులు అడ్డుకావడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్లాన్ వేశారు. కానీ అదేరోజు మాధురి సోదరుడు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే మాధురి మాత్రం ఇంట్లో అంత పెద్ద విషాదం ఉన్నా తన ప్రేమకోసం ఇల్లు వదిలివెళ్లిపోయింది. రాకేశ్‌తో ఒక గుడిలో పెళ్లిచేసుకుంది. ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. అయినా మాధురి మాత్రం తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని.. తన భర్త రాకేశ్‌తోనే ఉంటానని పోలీసులకు చెప్పింది.
ఇవి కూడా చదవండి