
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో తాజాగా హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల అమాయక బాలికపై ఆమె వదిన అమానవీయంగా ప్రవర్తించిన వైనం బయటపడింది. చదువు పేరుతో ఆ బాలకను గ్రామం నుంచి సిటీకి తీసుకెళ్లి ఇంటి పనులు చేయిస్తూ అతి క్రూరంగా హింసలు పెడుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ 13 ఏళ్ల బాలిక ముఖం, చేయి, కాళ్లపై వాతలు పెట్టింది.
విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెంటనే బృందాన్ని పంపి బాలికను రక్షించింది.
బీహార్‌కు చెందిన రాజేందర్ అనే వ్యక్తి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పని చేసుకుంటూ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల బీహార్ నుంచి తన చిన్నాన కూతురిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ఇంట్లో ఉంచి చదివిస్తానని బాలిక తల్లిదండ్రులకు మాటిచ్చాడు. అయితే అతని భార్య మాత్రం ఆ బాలికను పనిమనిషిగా మార్చేసింది. మొత్తం ఇంటి పనులన్నింటినీ ఆ బాలిక చేతే చేయించేది. ఆ బాలిక సరిగ్గా పనులు చేయకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టేది.
రెండేళ్లుగా ఆ బాలిక చిత్రహింసలకు గురవుతోంది. భార్యకు భయపడి భర్త నోరెత్తేవాడు కాదు. ఇటీవల ఆ బాలిక ముఖం, చేయి, కాళ్లపై ఆమె వదిన వాతలు పెట్టింది. అది చూసిన పొరుగింటి వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాలికకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆశ్రయం కల్పించింది.
ఇవి కూడా చదవండి