యువతిపై వేధింపులు.. అడ్డుకున్న ఆమె తల్లిపై ఘోరం.. స్వంత సోదరుడు ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2022-03-20T17:34:11+05:30 IST
ఆ యువకుడు తన సోదరి కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడు..
ఆ యువకుడు తన సోదరి కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడు.. ఆ యువతి తన తల్లికి విషయం చెప్పడంతో ఆమె తన తమ్ముడిని నిలదీసింది.. అయినా అతడు మారకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన తమ్ముడు నడిరోడ్డు మీద అక్కపై దాడి చేశాడు.. రోడ్డు మీద పడేసి చితక్కొట్టాడు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.
గ్వాలియర్‌కు సమీపంలోని శివ్‌పురి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన జితేంద్ర అనే వ్యక్తి తన సోదరి కూతురిని తరచుగా వేధించేవాడు. అసభ్యకర పనులు చేసేవాడు. దీంతో ఆ యువతి తన తల్లికి ఫిర్యాదు చేసింది. ఆ యువతి తల్లి తన సోదరుడిని నిలదీసింది. అయినా జితేంద్ర ప్రవర్తనలో మార్పు రాలేదు. మేనకోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరింది.
విషయం తెలుసుకున్న జితేంద్ర తన సోదరిని అనుసరించాడు. నడిరోడ్డు మీదే ఆమెపై దాడికి తెగబడ్డాడు. అక్కను రోడ్డుపై పడేసి కర్రతోనూ, చెప్పులతోనూ కొట్టాడు. స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు జితేంద్రపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.