Advertisement

క్రీడా రాణులు..అక్కా చెల్లెళ్లు

Mar 8 2021 @ 00:22AM
జిమ్నాస్టిక్స్‌లో సాధించిన పతకాలతో రంగజయచౌదరి


అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో 

61 పతకాలు సొంతం

 నేడు మహిళా దినోత్సవం..

కంభం, మార్చి 7 :  అక్కా చెల్లెళ్లు ఇద్దరు అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌లో అదుర్స్‌ అనిపి స్తున్నారు. ఇప్పటి వరకు 61 రాష్ట్ర, జాయతీ పతకాలను  సాధించి శభాష్‌ అనిపించుకు న్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కం భం మండలం పెద్దనల్లకాల్వ గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన బొట్టా రంగనాయకులు చౌదరికి క్రీడలపై అమితమైన ఆ సక్తి. చదువుకుంటూనే స్కూలు, కాలేజీ రోజు ల్లో పలు పతకాలు సాధించారు. కానీ తన పేదరికం వలన క్రీడలపై ఆసక్తిని వదులు కోవల్సి వచ్చింది. అయితే తనకు పుట్టిన ము గ్గురు అమ్మాయిలలో ఎవరికి ఏ క్రీడలపై ఆ సక్తి ఉందో తెలుసుకుని ఎన్ని కష్టాలు  ఎ దురైనా క్రీడల్లో వారు రాణించేలా తీర్చిది ద్దాలని సంకల్పించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పలు రకాల క్రీడలను నేర్పించాడు. రంగజయచౌదరి, రంగఝాన్సీచౌదరి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు చిన్నప్పటి నుంచి ఒకరు జిమ్నాస్టిక్స్‌, మరొకరు అథ్లెటిక్స్‌ పోటీల్లో రా ణించారు. మొన్నటి వరకు ఒకరు కడ ప స్పోర్ట్స్‌ స్కూలులో, మరొకరు సికింద్రాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూలులో విద్యాభ్యాసం చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో 61 పతకాలు సాధించారు. మారుమూల గ్రా మంలో అమ్మాయిలంటే కట్టుబాట్లు ఎక్కువే. అలాంటి పల్లె వాతావరణం నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు పలు క్రీడల్లో పతకాల  సాధిస్తున్నారు. పోటీలు ఎక్కడ నిర్వహించినా పతకాలు వారి మెడలో చేరాల్సిందే. అక్క రంగ ఝాన్సీ చౌదరి అథ్లెటిక్స్‌లో మొత్తం 51 రాష్ట్ర స్థాయి పతకాలు, 3 జాతీయ స్థాయి పతకాలు మొత్తం 54 పతకాలు సాధించిం ది. చెల్లెలు రంగజయ చౌదరి జిమ్నాస్టిక్స్‌లో 26 రాష్ట్రస్థాయి పతకాలు, 2 నేషనల్‌ సౌత్‌జోన్‌ పతకాలు సాధించింది.  ఇద్దరూ మొ త్తం 61 బంగారు, వెండి, కాంశ్య పతకాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఒలింపిక్‌ క్రీడలే లక్ష్యంగా సాధనలు చేస్తున్నారు. ప్ర స్తుతం ఈ అక్కాచెల్లెళ్లు కంభం వాసవి విద్యాసంస్థలో ఒకరు ఇంటర్‌ 2వ సంవత్సరం, మరొకరు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ క్రీడల్లోనే కాక చ దువులోనూ రాణిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అక్కా చెల్లెళ్లు మరిన్ని క్రీడా పతకాలు సాధించి ఒ లింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించాలన్న వారి లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.



 
అథ్లెటిక్స్‌లో సాధించిన పతకాలతో రంగఝాన్సీ


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.