
మెదక్: మెదక్లో మూడేళ్ల పాపను హింసించిన శాడిస్టును కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె(3)ను తరచూ హింసించేవాడు. ఇటీవల తన రెండో భార్య కళ్ల ముందే కుమార్తెను హింసించడం స్థానికులు సెల్లో చిత్రీకరించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఎమ్మెల్యే సీతక్క.. ఫేస్బుక్ వేదికగా స్పందించారు. ఇలాంటి ఘటనలు చూసినప్పడు రక్తం మరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడితే... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. శాడిస్టు నాగరాజును వెంటనే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.