నిరాడంబరంగా సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T06:20:36+05:30 IST

సీతారాముల కల్యాణం నిరాడంబరంగా నిర్వ హించారు. కరోనా కట్టడి నేపథ్యంలో దేవాలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు వేడుకలు నిర్వహించారు.

నిరాడంబరంగా సీతారాముల కల్యాణం
వేములవాడలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సీతారాముల కల్యాణం నిరాడంబరంగా నిర్వ హించారు. కరోనా కట్టడి నేపథ్యంలో దేవాలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు వేడుకలు నిర్వహించారు.  బుధ వారం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహిం చినా భక్తులు వీక్షించడానికి అవకాశం లభించలేదు. వేములవాడలో సీతారాముల తలంబ్రాలతో శివపార్వ తులు దశాబ్దాల కాలంగా  కల్యాణం చేసుకునే వారు. ఈ సారి వేడుకలకు అనుమతి లేకపోవడంతో వేములవాడకు రాలేదు. కొందరు భక్తులు వచ్చినా పోలీసులు వారిని వెనక్కి పంపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాల యం, రామాలయం, మార్కండేయ స్వామి దేవ స్థానం, శివసాయిబాబా దేవస్థానం, శివాల యంతో పాటు హనుమాన్‌ దేవాలయాల్లో వేడుకలు నిర్వహిం చారు.  బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని వివిధ దేవాలయాల్లో అర్చకులు, పరిమిత సంఖ్యలో కల్యాణ వేడుకలు నిర్వహించారు. 


 వేములవాడలో..

వేములవాడ : వేములవాడ రాజ రాజేశ్వరస్వామివారి క్షేత్రంలో  బుధవారం నిర్వ హించిన సీతారామచంద్రస్వామివారల కల్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా సాగింది. కరోనా వైరస్‌ రెండవ దశ ఉధృతంగా ఉన్న కారణంగా ప్రభుత్వ సూచనల మేరకు భక్తులు లేకుండా ఆలయం లోపల అంతరంగికంగా కల్యాణం నిర్వహించారు.  ఆలయ ప్రధాన అర్చకుడు నమిలికొండ ఉమేశ్‌శర్మ నేతృత్వంలో అర్చకులు, వేదపండితుల బృందం ముందుగా రాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  సీతామచంద్రస్వామివా రికి పంచోపనిషత్‌ ద్వారాభిషేకం  చేశారు. అనం తరం ఎదుర్కోళ్లు నిర్వహించారు. సీతారామ చంద్రస్వామివారి ఆలయంలో అభిజిత్‌ లగ్న సుముహూర్తమున వేదమంత్రాల మధ్య   కల్యా ణం ఘనంగా నిర్వహించారు. మరిగంటి గిరిధరాచార్యులు-మాధవి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్‌ స్వామివారికి పట్టువస్త్రాలు, తలం బ్రాలు సమర్పించారు. మున్సిపల్‌ తరఫున చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు.  అనంతరం యాగశాలో పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి  స్వామివారి వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. కరోనా కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి భక్తులను లోపలికి అనుమతించకపోవడంతో విధి నిర్వహణలోఉన్న ఆలయ సిబ్బంది, అర్చకుల మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం జరగాల్సిన  స్వామివారి రథోత్సవం రద్దు చే శారు. 

Updated Date - 2021-04-22T06:20:36+05:30 IST