క్రీడా ప్రాంగణాలకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-25T05:42:43+05:30 IST

క్రీడా ప్రాంగణాలకు స్థల పరిశీలన

క్రీడా ప్రాంగణాలకు స్థల పరిశీలన
చేవెళ్ల: మీర్జాగూడలో క్రీడాస్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

చేవెళ్ల/ఆమనగల్లు/మాడ్గుల/షాబాద్‌/మొయినాబాద్‌, మే 24: ప్రతి గ్రామపంచాయతీలో క్రీడాప్రాంగణానికి స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు చేవెళ్ల తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీడీవో రాజ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని రెవెన్యూ, పంచాయతీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు చేవెళ్ల మండలంలో ఉన్న 37గ్రామపంచాయతీలతో పాటు 11 అనుబంధ గ్రామాల్లో సైతం తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. క్రీడా ప్రాంగణం కోసం ఎకరా ప్రభుత్వభూమిని గుర్తిస్తున్నట్లు చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 24గ్రామాల్లో క్రీడాప్రాంగణాలకు స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన గ్రామాల్లో పర్యటించి క్రీడాస్థలాన్ని గుర్తిస్తామని తెలిపారు. అదేవిధంగా శంకర్‌పల్లి మండలంలో కూడా రెవెన్యూ అఽధికారులు వివిధగ్రామాల్లో పర్యటించి తెలంగాణ క్రీడాప్రాంగణాలను గుర్తించారు. కార్యక్రమంలో మండల ఆర్‌ఐ రాజేశ్‌, సర్వేర్‌ రవీందర్‌రెడ్డి, సిబ్బంది  ఉన్నారు. అదేవిధంగా ఆమనగల్లు మున్సిపాలిటీలోని మాడ్గుల రహదారి పక్కన గల కండె హరిప్రసాద్‌ వెంచర్‌, విఠాయిపల్లి చెన్నారం రహదారిలోని ఓవెంచర్‌లో  తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు మంగళవారం అధికారులు స్థలపరిశీలన చేశారు. తహాసీల్దార్‌ పాండూనాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ ఆయాచోట్ల వెంచర్లలో ఉన్న మున్సిపాలటీకి కేటాయించిన స్థలాలను పరిశీలించారు. మాడ్గుల రోడ్డులోని వెంచర్‌లో 17గుంటలు, చెన్నారం రోడ్డులో ఎకరా స్థలాన్ని క్రీడాప్రాంగణానికి పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అదేవిధంగా చెన్నంపల్లి, కొత్తకుంట తండా, పోలెపల్లి, సింగంపల్లి గ్రామాల్లో క్రీడాప్రాంగణాలకు స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీలత, సర్పంచులు పబ్బతి శ్రీనయ్య, శోభచందునాయక్‌, బాల్‌రామ్‌, ప్రేమలతనర్సింహ్మ, తదితరులు ఉన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ఉత్వర్వుల ప్రకారం ఆటస్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో పారుక్‌హుస్సేన్‌ తెలిపారు. మండలంలోని ఆర్కపల్లి, ఆసిరెడ్డిపల్లి, అందుగుల, పల్గుతండాలలో మంగళవారం ఎంపీడీవో ఫారుక్‌హుస్సేన్‌, ఎంపీవో వేజన్న, సీనియర్‌ అసిస్టెంట్‌ యాదయ్య, ఏపీవో నర్సింగ్‌లు ఆయాగ్రామ సర్పంచ్‌లతో కలసి ఆట స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలోని అంతారంలో క్రీడా ప్రాంగణానికి జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి భూమిపూజ చేశారు. మండలంలోని 41 గ్రామ పంచాయితీ పరిధిలో గల 62గ్రామాలకు గానూ మొత్తం 58గ్రామాల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు యాదమ్మ, మల్లేష్‌, పెంటయ్య, నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, రాజు, నర్సింహారెడ్డి, ముజాహిద్‌, బాలకృష్ణ, జంగయ్య ఉన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండలంలోని సురంగల్‌ గ్రామాన్ని ఎంపీడీవో సంధ్య సందర్శించి క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్‌ లావణ్య అంజిరెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్థులు ఉన్నారు. 

Updated Date - 2022-05-25T05:42:43+05:30 IST