ముంబైలో భారీ వర్షాలకు 112కు పెరిగిన మృతుల సంఖ్య!

ABN , First Publish Date - 2021-07-25T11:50:07+05:30 IST

మహారాష్ట్రలోని పూణె, కొంకణ్ డివిజన్‌లో గత మూడు రోజులుగా...

ముంబైలో భారీ వర్షాలకు 112కు పెరిగిన మృతుల సంఖ్య!

ముంబై: మహారాష్ట్రలోని పూణె, కొంకణ్ డివిజన్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య112కు పెరిగింది. మృతులలో 52 మంది రాయఘడ్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ మహారాష్ట్రలోని సంగలీ జిల్లాలో 78,111 మందిని, కొల్హాపూర్ జిల్లాలో 40,882 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 


సంగలిలో కృష్ణా నది, కొల్హాపూర్‌లో పంచగంగ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోంది. కాగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి ఫోన్ చేసి, రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే స్పందించిన అధికారులు అటువంటి ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. 

Updated Date - 2021-07-25T11:50:07+05:30 IST