మేజర్‌ కోసం ఆరు భారీ సెట్స్‌

Apr 23 2021 @ 00:33AM

అడవి శేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం కోసం ఆరు భారీ సెట్స్‌ వేశారు ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల. 26/11 ముంబై నగరంలో తాజ్‌ హోటల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్‌ హోటల్‌లోనే  చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్‌ చేశారు. కానీ వారి నుంచి అనుమతి రాకపోవడంతో ఏకంగా ఆ హోటల్‌ సెట్‌నే వేశారు. ఐదు వందల మంది కార్మికులు పది రోజుల పాటు శ్రమించి, ఈ భారీ సెట్‌కు రూపకల్పన చేశారు. అలాగే గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సెట్‌, ఎన్‌.ఎస్‌.జి. కమాండో ఆఫీసు సెట్‌ కూడా వేశారు. ‘ప్రతి సెట్‌ వేసే క్రమంలో మా టీమ్‌ ఎంతో రీసెర్చ్‌ చేసింది. ముఖ్యంగా తాజ్‌ ప్యాలెస్‌ సెట్‌ వేయడానికి చాలా కష్టపడ్డాం. అడవి శేష్‌ స్టోరీని నేరేట్‌ చేసేటప్పుడు తాజ్‌ హోటల్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. సినిమాలో దాన్నొక సెట్‌లా కాకుండా క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని చెప్పారు. అందుకే ఆయన చెప్పిన ప్రతి పాయింట్‌ను నోట్‌ చేసుకుని రియల్‌ తాజ్‌ ప్యాలెస్‌లా సెట్‌ వేశాం’ అని చెప్పారు అవినాష్‌. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.