కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృత్యువాత

ABN , First Publish Date - 2022-04-11T21:51:07+05:30 IST

బారుచ్ : గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బారుచ్ ప్రాంతంలోని దహెజ్‌ కేంద్రంగా రసాయనాలు ఉత్పత్తి చేస్తున్న ఓ కంపెనీలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ప్రమాదంలో సిబ్బందిలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృత్యువాత

బారుచ్ : గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బారుచ్ ప్రాంతంలోని దహెజ్‌ కేంద్రంగా రసాయనాలు ఉత్పత్తి చేస్తున్న ఓ కంపెనీలో సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ప్రమాదంలో సిబ్బందిలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. స్థానిక  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీఐడీసీ ఫేజ్ 3లోని కంపెనీ రియాక్టర్‌లో స్వేదన ప్రక్రియ కొనసాగుతుండగా అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించింది. అనంతరం యూనిట్ అంతటా మంటలు వ్యాప్తించాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. అయితే కంపెనీ ఫైర్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో మృతుల సంఖ్య తగ్గింది. కార్మికులతోపాటు సిబ్బందిని ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు ప్రశాంత్ యాదవ్, రతన్ కుశ్వాన్(ఇద్దరూ ఆపరేటర్లు) ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని తెలిపారు. మిగతవారిలో జునాఘడ్‌కు చెందిన జయదీప్ బమ్రోలియా ల్యాబ్ టెక్నీషియన్‌గా, నర్మదా జిల్లాకు చెందిన రాజుభాయ్ వాసవా హెల్పర్‌గా, జార్ఖండ్‌కు చెందిన పునీత్ మహంతో హెల్పర్‌గా, మధ్యప్రదేశ్‌కు చెందిన తీరథ్ గడారి ఆపరేటర్‌గా పనిచేస్తున్నారని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.

Updated Date - 2022-04-11T21:51:07+05:30 IST