heavy rainfall: భారీవర్షాలతో ఆరుగురి మృతి...ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

ABN , First Publish Date - 2022-08-29T16:45:08+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో(heavy rainfall) పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి....

heavy rainfall: భారీవర్షాలతో ఆరుగురి మృతి...ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో(heavy rainfall) పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.ఈ వరదల్లో ఆరుగురు మరణించారు. ఉత్తరాఖండ్(Uttarakhand), కేరళ(Kerala), ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో నదుల్లో వరదనీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది నీటిమట్టం డేంజర్ స్థాయికి(danger mark) చేరింది. దీంతో వరణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, బలియా నగరాల్లో లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి.యూపీలోని ప్రయాగరాజ్ నగరంలోని గంగా(Ganga) నదీ తీర ప్రాంతంలోని ఇళ్లు వరదనీటిలో(flood water) మునిగాయి.భారీవర్షాల వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్(Dehradun) నగరంలో ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు మరణించారు.


 యూపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(State Disaster Response Force) సహాయ పునరావాస పనులు చేపట్టింది. యూపీ మంత్రి గణేష్ జోషి ప్రయాగరాజ్ నగరంలో కూలిన ఇంటిని పరిశీలించారు.భారీవర్షాల వల్ల కేరళ రాష్ట్రంలోని తోడుపూజ కుడియాత్తూర్ లో సోమవారం ఉదయం ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి.(landslide hit) ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. కేరళలోని కొట్టాయం, పతనంతిట్ట జిల్లాల్లో ఆదివారం రాత్రి అతి భారీవర్షాలు కురవడంతో మెరుపు వరదలు వెల్తువెత్తాయి.తమిళనాడు రాష్ట్రంలో రాగల రెండు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ(Indian Meteorological Department) అధికారులు హెచ్చరించారు.


హోస్సూర్, తెంకనికొట్టాయి జిల్లాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గంగా నదీ తీరప్రాంతంలోని 80కిపైగా గ్రామాలు వరదనీటిలో మునిగాయి.అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.కోస్తా ఆంధ్రప్రదేశ్(Coastal Andhra Pradesh),రాయలసీమ(Rayalaseema), తెలంగాణ(Telangana), కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. 


Updated Date - 2022-08-29T16:45:08+05:30 IST