Puneలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు కూలీల మృతి

ABN , First Publish Date - 2022-02-04T13:17:05+05:30 IST

మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం గురువారం అర్దరాత్రి కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు....

Puneలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు కూలీల మృతి

పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం గురువారం అర్దరాత్రి కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.పూణే నగరంలోని ఎరవాడ పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మాల్ ఒక్కసారిగా కూలిపోయింది. 16 ఎంఎం ఇనుపరాడ్లతో స్లాబ్ కోసం మెష్ తయారు చేశారు. బేస్ మెంట్ పార్కింగ్ కోసం వేసిన ఇనుప మెష్ కూలిపోయిన సమయంలో 10మంది కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఇనుపరాడ్లు కార్మికుల శరీరాల్లో చొచ్చుకుపోయాయి. దీంతో కట్టర్ల సాయంతో ఐరన్ రాడ్లను కోసి కార్మికులను బయటకు తీశారు. 


ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించగా, మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పూణే ట్రాఫిక్ పోలీసు కమిషనర్ రాహుల్ శ్రీరామి చెప్పారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పూణే దుర్ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ ఘటనలో గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.


Updated Date - 2022-02-04T13:17:05+05:30 IST