చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

Published: Sun, 15 May 2022 14:20:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంటుంది.  దంపతులు చేసే తప్పుల కారణంగా ఒక్కోసారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరమవుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో డబ్బు విషయంలో గొడవలు జరుగుతుండగా.. మరికొన్ని కుటుంబాల్లో వివాహేతర సంబంధాల కారణంగా సమస్యలు తలెత్తుతుంటాయి. బీహార్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఏడుస్తూ ఉంది. ఏమైందో అని స్థానికులంతా కంగారుగా వెళ్లి చూసేసరికి.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ పరిధి తుర్కాన్హా గ్రామానికి చెందిన కౌషర్ అలీకి సాథియా(22) అనే యువతితో 2020 జూన్‌లో వివాహమైంది. వీరికి ప్రస్తుతం 6నెలల చిన్నారి ఉంది. పెళ్లయిన కొత్తలో భార్యను బాగా చూసుకున్న కౌషర్.. రానురాను చిత్రహింసలు పెట్టేవాడు. ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు తేవాలని భార్యను నిత్యం వేధించేవాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో రోజూ వివిధ సాకులు చూపి కొట్టేవాడు. ఈ క్రమంలో గత శనివారం మళ్లీ గొడవ జరిగింది. తల్లికి అనారోగ్యంగా ఉండడంతో చూసి వస్తానని సాథియా కోరింది. భార్యను పుట్టింటికి పంపకపోగా.. కౌషర్, అతడి కుటుంబ సభ్యులు కలిసి మళ్లీ దాడి చేశారు. తీవ్రగాయాలవడంతో సాథియా అక్కడికక్కడే మృతి చెందింది.

వదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు.. విషయం ఇంట్లో తెలియడంతో రోజూ గొడవలు.. ఓ రోజు అర్ధరాత్రి భార్య గదికి వెళ్లి..


తర్వాత సాథియా తల్లిదండ్రులకు ఫోన్ చేసిన కౌషర్.. ‘‘మీ కూతురిని మనువడు కొరికి చంపాడు’’..అని నమ్మించే ప్రయత్నం చేశాడు. తల్లి మృతదేహం పక్కనే ఉన్న 6నెలల చిన్నారి ఏడుస్తూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా సాథియా చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. భర్త చేసిన తప్పు కారణంగా అనాథగా మారిన చిన్నారిని చూసి.. స్థానికులంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

చేతిలో పసిబిడ్డతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుందో అమ్మాయి.. మైనర్ అయిన ఆమె చెప్పింది విన్న పోలీసులకు..ప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్‌ బాటిల్‌తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.