Work Permits: కువైత్ కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా అవకాశం

Published: Sat, 12 Mar 2022 08:34:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Work Permits: కువైత్ కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా అవకాశం

కువైత్ సిటీ: ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్స్ విషయమై కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. లేబర్ మార్కెట్‌ను పెంచుకునేందుకు మరో ఆరు కొత్త వృత్తులను వర్క్ పర్మిట్ల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో ఆయా వృత్తుల వారికి ఇకపై వర్క్ పర్మిట్లు పొందడం చాలా సులువు కానుంది. దీనివల్ల వారు మంచి బెనిఫిట్స్ పొందుతారని ఈ సందర్భంగా పీఏఎం చెప్పుకొచ్చింది. ఇక తాజాగా కొత్తగా చేర్చిన ఆరు కొత్త జాబ్ టైటిల్స్ విషయానికి వస్తే.. స్విమ్మింగ్ లైఫ్‌గార్డ్, డైవింగ్ ఇన్స్‌స్ట్రక్టర్, స్కూబా డైవింగ్ ఇన్స్‌స్ట్రక్టర్, వాటర్ స్కీయింగ్ కోచ్, వాటర్ స్కీయింగ్ సూపర్‌వైజర్. కాగా, కేటగిరీల్లో వర్క్ పర్మిట్స్ పొందడానికి అభ్యర్థులకు తప్పనిసరిగా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలని పీఏఎం వెల్లడించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.