UAE Traffic Rules: ప్రవాసులూ జర జాగ్రత్త.. దుబాయిలో వీటిని పాటించకపోతే ఏకంగా రూ.65 వేల జరిమానా తప్పదు..!

ABN , First Publish Date - 2022-09-15T16:58:42+05:30 IST

యూఏఈలోని (UAE) ప్రవాసులు అక్కడ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ (Traffic rules) గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

UAE Traffic Rules: ప్రవాసులూ జర జాగ్రత్త.. దుబాయిలో వీటిని పాటించకపోతే ఏకంగా రూ.65 వేల జరిమానా తప్పదు..!

రియాద్: యూఏఈలోని (UAE) ప్రవాసులు అక్కడ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన ట్రాఫిక్ రూల్స్ (Traffic rules) గురించి తెలుసుకోవడం చాలా అవసరం. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. ముఖ్యంగా అక్కడి హైవేలపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఫాస్ట్ లేన్స్‌లో (Fast lanes) డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాటి నిబంధనలు తూచతప్పకుండా పాటించాలి. వాటిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. ఫాస్ట్ లేన్స్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే ఒక్కొసారి 400 దిర్హమ్స్ (రూ.8,657) వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఇటీవల దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు (Dubai Traffic Police).. నివాసితులు, స్థానికులు ఫాస్ట్ లేన్స్‌లో డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమనిబంధనల విషయమై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


* వేరే వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఫాస్ట్ లేన్స్‌ను ఉపయోగించరాదు. వీటిని ప్రధానంగా ఎమర్జెన్సీ వాహనాల కోసం రూపొందించడం జరిగింది. 

* వాటిపై నిర్ధేశించిన వేగపరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాహనదారులు ఫాస్ట్ లేన్స్ వినియోగించకూడదు. 

* మీరు స్పీడ్ ట్రాక్‌లో స్పీడ్ లిమిట్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ, మిమ్మల్ని ఓవర్‌టేక్ చేయాలని చూస్తున్న వాహనదారులకు దారి ఇవ్వడానికి మీరు నిరాకరించకూడదు.  

* డెలివరీ రైడర్లకు ఫాస్ట్ లేన్స్‌పై అనుమతి లేదు. 

* పైవాటిలో ఏ ఒక్క రూల్‌ను బ్రేక్ చేసినా వాహనదారుడి ఖాతాలోకి 4 బ్లాక్ పాయింట్లతో పాటు రూ.8,657 జరిమానా విధిస్తారు. 

  


ఇక డ్రైవింగ్ లైసెన్స్ (Driving licence) విషయంలో కూడా యూఏఈలో పలు రూల్స్ ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే కూడా భారీ జరిమానాలు ఉంటాయి. అవేంటంటే..


* ఇతర దేశాల్లో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడపకూడదు. కొన్ని సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 400 దిర్హమ్స్ (రూ.8,657) ఫైన్ ఉంటుంది.

* మనకు మంజూరైన లైసెన్స్‌తో కాకుండా వేరే లైసెన్స్‌తో వాహనం నడపడం కూడా నేరమే. దీనికిగాను 12 బ్లాక్ పాయింట్లు, 400 దిర్హమ్స్ (రూ.8,657) జరిమానా విధిస్తారు. 

* గడువు ముగిసిన డ్రైవింగ్ లైన్స్‌‌ను వినియోగిస్తే 500 దిర్హమ్స్ (రూ.10,822) జరిమానా, 4బ్లాక్ పాయింట్లతో పాటు 7 రోజులు వాహనం జప్తు చేయడం జరుగుతుంది. 

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే 400 దిర్హమ్స్(రూ.8,657) ఫైన్ ఉంటుంది.

* మొదటి ట్రాఫిక్ ఉల్లంఘనలోనే భారీ మొత్తంలో బ్లాక్ పాయింట్లు పడినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వెయ్యి దిర్హమ్స్(రూ.21వేలు) జరిమానా చెల్లించాలి. 

* రెండోసారి ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా గరిష్ట పరమితిలో బ్లాక్ పాయింట్లు పడిన సందర్భంలో డ్రైవింగ్ లైసెన్స్ అప్పగించడంలో జాప్యం చేస్తే 2వేల దిర్హమ్స్ (రూ.43వేలు) జరిమానా ఉంటుంది.

* మూడోసారి ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినప్పుడు గరిష్ట పరిమితిలో బ్లాక్ పాయింట్లు పడినప్పుడు ట్రాఫిక్ అధికారులకు డ్రైవింగ్ లైసెన్స్ అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తే 3వేల దిర్హమ్స్ (రూ. 65వేలు) ఫైన్ విధిస్తారు. 

Updated Date - 2022-09-15T16:58:42+05:30 IST