Himachal Pradeshలో లోయలో పడిన బస్సు...16మంది మృతి

ABN , First Publish Date - 2022-07-04T16:14:24+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో సోమవారం బస్సు లోయలో పడిపోవడంతో 16 మంది మృతి చెందారు....

Himachal Pradeshలో లోయలో పడిన బస్సు...16మంది మృతి

కులూ : హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో సోమవారం బస్సు లోయలో పడిపోవడంతో 16 మంది మృతి చెందారు.హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని సైన్జ్ లోయలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు పడిపోవడంతో పాఠశాల విద్యార్థులతో సహా 16 మంది మరణించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో 45 మందితో వెళుతున్న బస్సు  ప్రమాదవశాత్తూ లోయలో పడింది. సైన్జ్ వెళుతున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయిందని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన ప్రదేశం జిల్లా కేంద్రానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు క్షతగాత్రులను రక్షించారు.


హృదయాన్ని కలచివేసింది: ప్రధాని మోడీ.. 

కులు బస్సు ప్రమాద ఘటన హృదయాన్ని కలచివేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. స్థానిక అధికారులు వీలైనంత సహకారం అందించాలని కోరారు. కాగా మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Updated Date - 2022-07-04T16:14:24+05:30 IST