Argentinaలో కొకైన్ తీసుకున్న 16 మంది మృతి

ABN , First Publish Date - 2022-02-03T13:31:52+05:30 IST

డ్రగ్స్ తీసుకుంటున్న వారికి షాకింగ్ వార్త తాజాగా వెలుగుచూసింది...

Argentinaలో కొకైన్ తీసుకున్న 16 మంది మృతి

బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): డ్రగ్స్ తీసుకుంటున్న వారికి షాకింగ్ వార్త తాజాగా వెలుగుచూసింది. అర్జెంటీనా దేశంలో విషపూరితమైన కొకైన్‌ తిని 16 మంది మరణించిన ఘటన సంచలనం రేపింది. కల్తీ కొకైన్ తీసుకున్న కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని అర్జెంటీనా ప్రభుత్వం తెలిపింది.బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్సులో విషపూరితమైన కొకైన్ తిన్న వారిలో 16 మంది మరణించగా, మరో 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని ప్రావిన్షియల్ భద్రతా మంత్రి సెర్గియో బెర్నీ ప్రతినిధి చెప్పారు.


డ్రగ్స్ మరణాలు సంభవించిన తర్వాత ప్రాంతీయ భద్రతా దళాలు డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.కొకైన్ లో విషపూరితమైన పదార్థముందని తేలడంతో దాన్ని ల్యాబోరేటరీ పరీక్ష కోసం పంపించారు.కొకైన్ తినడం వల్ల ప్రజలు మూర్చతోపాటు స్పృహ కోల్పోతున్నారని అధికారులు చెప్పారు. దీంతో ప్రజలు కొకైన్ ను వినియోగించవద్దని అర్జెంటీనా సర్కారు కోరింది. 


Updated Date - 2022-02-03T13:31:52+05:30 IST